Kodandaram: మోదీ హయాంలో అదానీ, అంబానీ సంపద పెరిగింది: కోదండరాం

Kodandaram accuses PM Modi
  • బిజినేపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న కోదండరాం
  • కాంగ్రెస్ పార్టీ గెలిచాకే తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని విమర్శ
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ప్రజల సంపద ఏమో కానీ... అదానీ, అంబానీ సంపద మాత్రం పెరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. మంగళవారం నాగర్ కర్నూలులోని బిజినేపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ గెలిచాకే తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని విమర్శించారు.
Kodandaram
Revanth Reddy
Congress
Narendra Modi

More Telugu News