జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం
- భారత్ లో సార్వత్రిక ఎన్నికలు... మొత్తం ఏడు దశల్లో పోలింగ్
- నేడు తొలి దశ పోలింగ్
- ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్
నేడు దేశంలో తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది.
ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ప్రదర్శించరాదని ఈసీ పేర్కొంది.