యూట్యూబర్ అరెస్ట్.. కంట్రోల్ లో ఉండాలి మరి!
- బెంగళూరు ఎయిర్ పోర్టులో వీడియో
- తనను ఎవరూ పట్టుకోలేదని గొప్పలు
- అరెస్ట్ చేసిన పోలీసులు
వివరాల్లోకి వెళ్తే... బెంగళూరు యలహంకకు చెందిన వికాస్ గౌడ ఈ నెల 7న మధ్యాహ్నం 12.06 గంటల సమయంలో బెంగళూరు - చెన్నై టికెట్ కొని ఎయిర్ పోర్టులోకి వెళ్లాడు. అయితే, విమానం ఎక్కకుండా ఎయిర్ పోర్టు పరిసరాల్లో తిరుగుతూ... వీడియో రికార్డింగ్ చేశాడు. ఆ వీడియోను ఏప్రిల్ 12న తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు... ఎయిర్ పోర్ట్ మొత్తం తిరిగినా... తనను ఎవరూ పట్టుకోలేదని గొప్పగా చెప్పుకున్నాడు. ఎయిర్ పోర్ట్ లో భద్రత గురించి నెగెటివ్ గా కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ వింగ్ అయిన సీఐఎస్ఎఫ్ ఆయనపై ఫిర్యాదు చేసింది. వికాస్ గౌడపై ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు నమోదయింది. వికాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు.