సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్
- ఏప్రిల్ 13న సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి
- ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
- నేడు విజయవాడ కోర్టులో హాజరు
- మే 2 వరకు రిమాండ్ విధించిన జూనియర్ సివిల్ జడ్జి
కాగా, నిందితుడి పుట్టినతేదీపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఆధార్ కార్డు ప్రకారం అతడు మైనర్ అని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే, తాము మున్సిపల్ శాఖ ఇచ్చిన పుట్టినతేదీ ధృవపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.