కేసీఆర్ మానసిక రోగిలా మాట్లాడుతున్నారు: తుమ్మల నాగేశ్వరరావు
- ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరన్న తుమ్మల
- కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పడం కేసీఆర్ మూర్ఖత్వమని వ్యాఖ్య
- మూడో సారి మోసం చేేసేందుకు మోదీ వస్తున్నాడని విమర్శ
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ చెప్పడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ ఒక మానసిక రోగిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారీ ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆరోపించారు. మహబూబాబాద్ లోక్ సభ పరిధిలోని ఇల్లందులో మహిళా నాయకుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.