MIM: మమ్మల్ని చంపాలని చూస్తున్నారు.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

MIM Mla Akbaruddin Owaisi Sensational Comments
  • జైలులో వేసి చికిత్స పేరుతో అంతమొందించే కుట్ర
  • హైదరాబాద్ లో తాము బలంగా ఉండడంతో బెదిరింపులు
  • ఎవరు ఎంత ప్రయత్నించినా గెలుపు తమదేనని ధీమా
హైదరాబాద్ లో ఓవైసీ బ్రదర్స్ బలంగా ఉన్నారని, ఎన్నికల్లో వారిని ఓడించడం తమ వల్ల కాదనే భయంతో కొంతమంది కుట్రలకు తెరలేపారని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఓవైసీ బ్రదర్స్ ను అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని దుష్టశక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని.. కానీ తాను అంత ఈజీగా వెళ్లిపోయేవాడిని కాదన్నారు. 

తమను జైలుకు పంపించి అక్కడ వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి చంపేయవచ్చని అన్నారు. లేదా గన్ తో కాల్చి చంపేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, తాము ఇలాంటి వాటికి భయపడబోమని ఎంఐఎం కీలక నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఎవరు ఎంతగా ప్రయత్నించినా సరే తమను ఓడించడం సాధ్యం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


More Telugu News

MIM
Akbaruddin Owaisi
Murder Plot
Jail
Parliament polls
Hyderabad