కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడమేంటి?.. కవితకు కోర్టు వార్నింగ్
- మరోసారి ఇలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చినా వినిపించుకోని ఎమ్మెల్సీ
- కోర్టు హాల్ నుంచి బయటికొస్తూ మరోసారి మీడియాతో మాట్లాడిన కవిత
- ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించిన రౌస్ ఎవెన్యూ కోర్టు
ఈ సందర్భంగా కవిత మళ్లీ మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తి హెచ్చరికలను పెడచెవిన పెట్టి మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని వ్యాఖ్యానించారు. ‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ అడిగిందే.. లోపల సీబీఐ అడుగుతోంది. ఇందులో కొత్తది ఏమీ లేదు’ అని కవిత ఆరోపించారు. మధ్యంతర బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. రెగ్యులర్ బెయిల్ పై దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు ఈ నెల 16న విచారించనుంది.