ఈరోజు నుంచి కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ కస్టడీకి కవిత
- మూడు రోజుల పాటు ప్రశ్నించనున్న సీబీఐ
- సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు
ఈ నెల 15వ తేదీ వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతించింది. ఆమె తరపు న్యాయవాదులు కూడా ఆమెను కలవొచ్చు. మరోవైపు ఇంటి భోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్ ను కోర్టు అనుమతించింది. ఆప్ కు రూ. 100 కోట్లు చెల్లించిన వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత రూ. 14 కోట్లు తీసుకున్నారని సీబీఐ తెలిపింది. రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా ఉండదని బెదిరించారని చెప్పింది.