Volunteers: రాజీనామా చేసి టీడీపీలో చేరిన 40 మంది వాలంటీర్లు

40 volunteers resigns and joins TDP
  • నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల రాజీనామా
  • టీడీపీ నేత వేమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిక
  • చంద్రబాబుపై నమ్మకంతోనే టీడీపీలో చేరామన్న వాలంటీర్లు
ఏపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల పేరు మారుమోగుతోంది. ఎన్నికల ముందు నుంచి కూడా రాజకీయం వాలంటీర్ల చుట్టూనే తిరిగింది. వాలంటీర్లే మన సైన్యం అని సీఎం జగన్ సహా వైసీపీ నేతలంతా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో, ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనరాదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పలువురు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్నారు. 

తాజాగా సీన్ రివర్స్ అయింది. భారీ సంఖ్యలో వాలంటీర్లు టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడువలూరు మండలంలో 40 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వీరంతా టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబుపై నమ్మకంతోనే టీడీపీలో చేరామని వారు చెప్పారు.   
Volunteers
Andhra Pradesh
Telugudesam
Chandrababu

More Telugu News