వావ్.. రవి బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్!
- గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో అద్భుతమైన రిటర్న్ క్యాచ్ పట్టిన బిష్ణోయ్
- రవి బిష్ణోయ్ క్యాచ్‌తో పెవిలియన్‌కు కేన్ విలియమ్సన్
- గుజరాత్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ రెండో బంతికి యువ స్పిన్నర్ అద్భుతం
- ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్
ఆ బంతిని కేన్ మామ స్ట్రైట్‌గా ఆడి సింగిల్ తీయాలని చూశాడు. కానీ, బంతి కాస్త గాల్లోకి లేచింది. దాంతో బిష్ణోయ్ తన కుడివైపు గాల్లోకి ఎగిరి ఒకే చేతితో అద్భుతమైన రిటర్న్ క్యాచ్ తీసుకున్నాడు. అంతే.. ఒక్కసారిగా గ్రౌండ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. బిష్ణోయ్ అందుకున్న ఆ స్టన్నింగ్ క్యాచ్‌తో విలియమ్సన్ కూడా నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమ క్యాచులలో ఇది ఒకటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రవి బిష్ణోయ్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌పై మీరు ఓ లుక్కేయండి.