Three Capitals: మూడు రాజధానుల శిబిరం ఎత్తివేసిన వైసీపీ నేతలు... లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిక

Three capitals camp organisers joins TDP
  • నాలుగేళ్లుగా మందడం గ్రామంలో మూడు రాజధానుల శిబిరం
  • నేటితో శిబిరం మూసివేసిన నిర్వాహకుడు గురునాథం
  • గురునాథం తదితరులను లోకేశ్ వద్దకు తీసుకెళ్లిన కేశినేని చిన్ని 
ఏపీ రాజధాని అమరావతే అంటూ రైతులు గత ఐదేళ్లుగా ఉద్యమం నిర్వహిస్తుండగా, వారికి పోటీగా నాలుగేళ్ల కిందట వైసీపీ నేతలు మూడు రాజధానుల శిబిరం ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా మందడం గ్రామంలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న మూడు రాజధానుల శిబిరం నేటితో మూతపడింది. ఈ శిబిరం నిర్వాహకుడు గురునాథం, మరికొందరు నేతలు నేడు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిలో వైసీపీ అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు ఉన్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ నేతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు.
Three Capitals
TDP
Nara Lokesh
YSRCP
Amaravati
Andhra Pradesh

More Telugu News