Madhavaram Krishna Rao: ఎంపీగా మల్కాజ్‌గిరికి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

kukatpally mla Krishna Rao takes on Revanth Reddy over malkajgiri development
  • మల్కాజ్‌గిరి అభివృద్ధికి ముఖ్యమంత్రి చేసిందేమీ లేదన్న మాధవరం 
  • ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒరగబెట్టిందేమి లేదన్న ఎమ్మెల్యే
  • మహిళలకు గృహలక్ష్మి, రూ.2500 హామీలను తుంగలో తొక్కారని విమర్శ
గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్ సభ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ఎంపీగా ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మల్కాజ్‌గిరి అభివృద్ధికి ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. మహిళలకు గృహలక్ష్మి, రూ.2500 హామీలను తుంగలో తొక్కారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజలు పనిచేసే వారిని గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Madhavaram Krishna Rao
Revanth Reddy
BRS
Congress

More Telugu News