పట్టపగలు.. నడివీధిలో కత్తులు ప్రదర్శిస్తున్నారు: నారా లోకేశ్
- వైజాగ్ లో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయన్న లోకేశ్
- సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపాటు
- చట్టాలు, పోలీసుల భయం లేకుండా పోయిందన్న లోకేశ్
రాష్ట్రంలో క్రిమినల్ గ్యాంగులకు చట్టాలన్నా, పోలీసులన్నా భయంలేకుండా పోయిందని, ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణమని లోకేశ్ ఆరోపించారు. అధికార పార్టీ ఇలాంటి రౌడీలను పెంచి పోషిస్తోందని, తద్వారా రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని ప్రయత్నిస్తోందని నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు.