ఏలూరులో దారుణం.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి విశ్రాంత ఉద్యోగి ఇంటిని దోచుకున్న వైద్యుడు
- ఇంజక్షన్ ప్రభావం నుంచి కోలుకోలేక బాధితుడు మల్లేశ్వరరావు మృతి
- గతేడాది డిసెంబరు 24న ఘటన
- తొలుత సహజ మరణంగానే భావించిన కుటుంబ సభ్యులు
- నిందితుడు భానుసుందర్ ప్రవర్తనపై అనుమానంతో నిలదీత
- పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
మత్తు ఇంజక్షన్ కారణంగా మగతలోకి వెళ్లిపోయిన మల్లేశ్వరరావు ఆ తర్వాత కోలుకోలేక చనిపోయారు. కుటుంబ సభ్యులు తొలుత దానిని సహజ మరణంగానే భావించారు. అయితే, భానుసుందర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో నిలదీశారు. ఆ తర్వాతి నుంచి అతడు కనిపించడం మానేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భానుసుందర్ కోసం గాలిస్తున్నారు. కాగా, గతంలోనూ ఏలూరు త్రీటౌన్ పరిధిలో వైద్యం పేరుతో నిందితుడు ఇలా రోగులను దోచుకున్నట్టు తెలిసింది. ఏలూరు త్రీటౌన్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లలో భానుసుందర్‌పై ఇప్పటికే కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.