KCR: పొలంబాట పట్టిన కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్.. ఇదిగో వీడియో!

Congress Targets KCR Over His District Visits
షార్ట్స్‌లో చూడండి
‘ఏ ముఖం పెట్టుకుని పొలం బాట పడుతున్నావ్ కేసీఆర్?’ అంటూ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో బీఆర్ఎస్ అధినేతను ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ కేసీఆర్ నేటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఎండిన పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ద్వారా కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘ఏ ముఖం పెట్టుకుని పొలం బాట పడుతున్నావ్ కేసీఆర్? నీ పాలనలో రైతులకు ఇచ్చిన మాట తప్పినందుకా? నువ్వు ఇస్తానన్న పంట నష్టం రూ. 10 వేలు ఇచ్చేందుకా? వడ్లు కొనుకుండా రైతుల ఉసురు తీసినందుకా? మద్దతు ధర కల్పించకుండా రైతులను అప్పుల పాలు చేసినందుకా? వరి వేస్తే ఉరే అని భయపెట్టినందుకా? కాళేశ్వరం స్కాంలో నువ్వు తిన్న పైసలు రైతులకు పంచేందుకా? అని ప్రశ్నించింది. గత పదేళ్లలో ఏనాడూ రైతుల కష్టాలు పట్టించుకోని నీకు ఇవాళ రైతులు గుర్తొచ్చారా? అయినా, నువ్వు కాలు పెట్టిన కాడల్లా నాశనమే. పచ్చని పొలాలు కూడా ఎండిపోతాయి. రావొద్దు కేసీఆర్. నీ దరిద్రం పోయిందని సంతోషంగా ఉన్న తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టొద్దు కేసీఆర్’ అని వీడియోను షేర్ చేసింది.
Go Back to Shorts
KCR
BRS
Congress
Revanth Reddy
Congress Twitter

More Telugu News