నితిన్ బర్త్‌డే సందర్భంగా 'రాబిన్ హుడ్' నుంచి గ్లింప్స్.. ఈసారి ట్విస్ట్ అదిరింది!
- ఏజెంట్ 'రాబిన్ హుడ్' అంటూ అసలు క్యారెక్టర్‌ను రివీల్ చేసిన యూనిట్
- ఇంతకుముందు టైటిల్ గ్లింప్స్‌లో హీరోను దోపిడీలు చేస్తున్నట్లు చూపించిన వైనం
- ఆసక్తికరంగా 'రాబిన్ హుడ్' స్పెషల్ గ్లింప్స్
- మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం.. జీవీ ప్రకాశ్ బాణీలు
తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో మాత్రం ఏజెంట్ అని అన్నారు. మరీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నితిన్.. దోపిడీలు ఎందుకు చేశారనేది ఇప్పుడు ట్విస్ట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ స్పెషల్ గ్లింప్స్ మాత్రం ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, జీవీ ప్రకాశ్ బాణీలు అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే నితిన్, వెంకీ కాంబోలో 'భీష్మ' చిత్రం వచ్చి భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ‘రాబిన్ హుడ్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.