కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే కౌంటర్
- మీ హయాంలో నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు మీడియా ముందుకు వచ్చారన్న విషయాన్ని మరచిపోయారని విమర్శలు
- పశ్చిమబెంగాల్‌లో హైకోర్టు మాజీ న్యాయమూర్తికి మీ పార్టీ సీటు ఇచ్చిందన్న మల్లికార్జున ఖర్గే
- ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి గట్టి కౌంటర్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
‘‘ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మాజీ హైకోర్టు న్యాయమూర్తిని పశ్చిమ బెంగాల్‌లో మీ పార్టీ పోటీకి దింపిన విషయాన్ని మీరు మరచిపోయారు. ఆ జడ్జికి మీ పార్టీ అభ్యర్థిత్వం ఎందుకు దక్కింది? నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌ను (ఎన్‌జేఏసీ) ఎవరు తీసుకొచ్చారు? సుప్రీంకోర్టు దానిని ఎందుకు నిలిపివేసింది?’’ అని ప్రశ్నల రూపంలో మోదీ ప్రభుత్వాన్ని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘‘వ్యవస్థలను ఒకదాని తర్వాత మరొక దాన్ని బెదిరిస్తున్నది మీరే. మీరు పాపాలు చేసి కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం ఆపండి. ప్రజాస్వామ్యాన్ని ఏమార్చడం, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీయడంలో మీరు సిద్ధహస్తులు!’’ అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.
కాగా దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు గురువారం లేఖ రాశారు. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థశక్తులు ఒత్తిడి వ్యూహాలను అమలుచేస్తున్నాయని లేఖలో లాయర్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.