ఎన్నికల కోసం ఏపీకి ముగ్గురు పరిశీలకుల నియామకం
- ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
- ప్రత్యేకంగా పోలీసు, సాధారణ ఎన్నికలు, ఎన్నికల వ్యయం పరిశీలకుల నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏపీకి ముగ్గురు స్పెషల్ అబ్జర్వర్లను కూడా నియమించిన నేపథ్యంలో, కేంద్రం ఏపీపై ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం అర్థమవుతోంది.