బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించిన నీతా అంబానీ
- నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన నీతా అంబానీ
- బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
- సుమారు 15 నిమిషాల పాటు ఆలయంలో గడిపిన నీతా అంబానీ
- పూజల అనంతరం ఆమెకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ ఈఓ కుంట నాగరాజు
అంతకుముందు ఆమెకు ఆలయ ఈఓ కుంట నాగరాజు, ఛైర్మన్ కొత్తపల్లి సాయిబాబాగౌడ్ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం నీతా అంబానీకి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఇక ముంబై ఫ్రాంచైజీ యజమాని అయిన నీతా అంబానీ హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఎప్పుడు మ్యాచ్ ఆడినా ఆమె తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకుంటారు.