Memantha Siddham: మేమంతా సిద్ధం... వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర

CM Jagan bus tour starts from YSR Ghat in Idupulapaya
  • నేటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
  • మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర
  • ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు
  • ఈ సాయంత్రం ప్రొద్దుటూరు సిద్ధం సభ
ఏపీ సీఎం జగన్ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. 'మేమంతా సిద్ధం' పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. 

ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ తన తండ్రి దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. 

అనంతరం ఇడుపులపాయ నుంచి ఎన్నికల సమరశంఖం పూరించారు. వైఎస్సార్ ఘాట్ నుంచి జగన్ బస్సు ముందుకు కదిలింది. ఇవాళ కడప పార్లమెంటు స్థానం పరిధిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగనుంది. 

వేంపల్లి, వీఎన్ పల్లి, యర్రగుంట్ల ప్రొద్దుటూరు జంక్షన్, పొట్లదుట్టి మీదుగా మేమంతా సిద్ధం యాత్ర సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకోనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో సిద్ధం సభ నిర్వహించనున్నారు.
Memantha Siddham
YS Jagan
Idupulapaya
YSRCP
Andhra Pradesh

More Telugu News