Revanth Reddy: ఢిల్లీ బ‌య‌లుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy went to Delhi
  • సీఎం వెంట మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి
  • లోక్‌స‌భ అభ్య‌ర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చ‌ర్చ‌ల కోసం ఢిల్లీకి సీఎం 
  • మిగిలిన 8 స్థానాల‌కు నేడు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ బ‌య‌లుదేరారు. సీఎం వెంట మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ వెళ్లారు. లోక్‌స‌భ అభ్య‌ర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని స‌మాచారం. ఇక రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాల‌కు గాను ఇప్ప‌టికే 9 స్థానాల‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మిగిలిన 8 స్థానాల‌కు నేడు చ‌ర్చ‌ల అనంత‌రం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.
Revanth Reddy
Delhi
Lok Sabha Polls
Telangana

More Telugu News