వాలంటీర్లలో ఇంజనీరింగ్ చదివినవాళ్లు కూడా ఉన్నారు... వాళ్లకు ఒకటే చెబుతున్నా: చంద్రబాబు
- కుప్పంలో యువతతో చంద్రబాబు సమావేశం
- వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చిన టీడీపీ అధినేత
- వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
"ఇంజనీరింగ్ చదివిన వాళ్లు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా... మీరు బయటికి రండి. ఇవాళ ఐదు వేలు జీతం తీసుకుంటున్నారు. మీరు ఇంట్లోనే కూర్చుని రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం" అని చంద్రబాబు వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువత జీవితాలు మెరుగుపరిచే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.