విజయవాడలో రణరంగం సృష్టించిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్.. పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి!
- తాగొచ్చి బస్టాండ్‌లో బెంచీలు ఆక్రమించుకుని నిద్రించిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్
- ప్రయాణికుల ఫిర్యాదుతో వారిని పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది యత్నం
- ఒక్కసారిగా రెచ్చిపోయిన నిందితులు, ఏకంగా వంద మంది దాడికి దిగిన వైనం
- అదనపు పోలీసు బలగాలు రావడంతో పరిస్థితి అదుపులోకి, నిందితుల్లో కొందరి అరెస్టు
బ్లేడ్లతో దాడికి పాల్పడటంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఈ క్రమంలో సాంబయ్య అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలు కూడా అయ్యాయి. ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈలోపు అదనపు బలగాలు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. కొందరిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, రైల్వేస్టేషన్‌కు రానివ్వకపోవడంతో వారందరూ బస్టాండ్‌కు వస్తున్నారని స్థానికులు కొందరు తెలిపారు.