Nalgonda District: నల్గొండ, భువనగిరి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే...!

KCR announces Nalgonda and Bhuvanagiri lok sabha candidates
  • భువనగిరి నుంచి క్యామ మల్లేశ్ పోటీ
  • నల్గొండ నుంచి పోటీ చేయనున్న కంచర్ల కృష్ణారెడ్డి
  • హైదరాబాద్ మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
బీఆర్ఎస్ శనివారం సాయంత్రం మరో ఇద్దరు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు. ఉదయం సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పద్మారావు గౌడ్ పేరును ప్రకటించారు. ఈరోజుతో హైదరాబాద్ మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది.
Nalgonda District
Yadadri Bhuvanagiri District
Lok Sabha Polls
BRS
KCR

More Telugu News