ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
- శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఘటన
- ముగ్గురిపై దాడిచేసిన ఎలుగుబంటి
- బంధించేందుకు ప్రయత్నిస్తున్న అటవీశాఖ అధికారులు
ఎలుగుబంటి దాడి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దానిని బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయంతో హడలిపోతున్నారు. గ్రామం విడిచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.