వైజాగ్ ను గంజాయి కాపిటల్ గా మార్చేశారు: నారా భువనేశ్వరి
- ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో, ఏమనుకోవాలో అర్థంకావట్లేదని విమర్శ
- లక్షల కోట్ల విలువైన గంజాయి ఇటీవల విశాఖలో పట్టుబడిందన్న భువనేశ్వరి
- అది సమాజంలోకి వస్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించాలని సూచన
మొన్నటికి మొన్న ఒకే ఒక్క కంటైనర్ లో వేల కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్తలు మనమంతా చూశామని చెప్పారు. ఈ లక్షల కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి సమాజంలోకి వస్తే మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఓ వీడియో సందేశాన్ని నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.