మేం ముందే చెప్పాం.. మీరే పట్టించుకోలేదు.. రష్యాలో ఉగ్రఘటనపై అమెరికా
- మాస్కో ఉగ్రదాడిలో 60 మందికిపైగా మృతి
- ‘డ్యూటీ టు వార్న్’లో భాగంగా ముందే హెచ్చరించామన్న యూఎస్
- ఈ నెల మొదట్లో సమాచారాన్ని చేరవేశామన్న నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్
‘డ్యూటీ టు వార్న్’ విధానంలో భాగంగా బైడెన్ ప్రభుత్వం తమకు అందే ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకుంటుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కిడ్నాపులు, ఎక్కువమందిని హత్యచేయాలన్న పథకాలపై శీఘ్రంగా స్పందించి ఆయా దేశాలకు సమాచారం అందిస్తుందని వివరించారు. అమెరికా ముందుగానే హెచ్చరించినప్పటికీ పుతిన్ ప్రభుత్వం అప్రమత్తం కాకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబున్నారు.