పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు
- సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోనకు విచ్చేసిన టీడీపీ అధినేత
- స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు
- స్వామివారి దర్శనం ఎంతో సంతోషం, సంతృప్తిని కలిగించిందని వెల్లడి
దీనిపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. అడవులు, కొండల మధ్య కొలువైన స్వామివారి దర్శనం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ప్రజల కోసం పోరాడే శక్తిని, పనిచేసే సామర్థ్యాన్ని ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నానని చంద్రబాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి, ప్రజలకు అంతా మంచి జరగాలని స్వామి వారిని ప్రార్థించానని వివరించారు.

