హామీలపై బదులిచ్చాకే బస్సు ఎక్కు.. జగన్ కు చంద్రబాబు సవాల్
- ఐదేళ్ల పదవీ కాలాన్ని దోపిడీ కోసం వెచ్చించాడంటూ ఫైర్
- 99 శాతం అమలు కాదు 99 హామీలపై ప్రజలను ఏమార్చాడని ఆరోపణ
- ఏపీ ప్రజలను మరోసారి మోసం చేసేందుకే జగన్ బస్సు యాత్ర అని విమర్శ
- నారా లోకేశ్ ట్వీట్ ను రీట్వీట్ చేసిన టీడీపీ చీఫ్
జగన్ ఇచ్చిన 99 హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదంటూ నారా లోకేశ్ చేసిన వీడియో ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో జగన్ పై లోకేశ్ విమర్శలు గుప్పించారు. గత శాసన సభ, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ను పొందుపరిచారు. ‘జగన్ రెడ్డి 99 మోసాలు.. ఏమార్చిన 99 హామీలు’ అంటూ లోకేశ్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి ‘హామీలు నెరవేర్చి ఓట్లు అడగడానికి వస్తా అన్నావ్.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావ్ జగన్. అయినా పరదాలు ఉండగా నీకేంటి సిగ్గు!’ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.