పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
- కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్
- బుధవారం ఉదయం గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్
బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన యాదగిరిగుట్టకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉన్నారు. ఆలయ అర్చకులు గవర్నర్‌కు వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత సాయంత్రం గవర్నర్ కుటుంబసమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు.