యూదులు డెమొక్రటిక్ పార్టీకి ఓటు వేస్తే వారి మతాన్ని ద్వేషించినట్టే.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- డెమొక్రటిక్ పార్టీకి ఓటు వేసే యూదులు సిగ్గుపడాలన్న మాజీ అధ్యక్షుడు
- తన మాజీ సలహాదారుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూదు సంఘాలు, డెమొక్రటిక్ పార్టీ నేతలు
కాగా ట్రంప్ వ్యాఖ్యలపై అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వర్గాలు, డెమొక్రటిక్ పార్టీ నేతలు, యూదు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం మతాన్ని ముడిపెట్టి ప్రచారం చేయడం ఏమిటని మండిపడుతున్నారు. యాంటీ-డిఫమేషన్ లీగ్, అమెరికన్ జ్యూయిష్ కమిటీ, యూదు డెమొక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ అమెరికాతో పాటు పలు గ్రూపులు ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. తోటి పౌరులను బెదిరించే విద్వేష విధానాలు, మూస పద్ధతులు ఏమాత్రం సమర్థనీయం కాదని వైట్ హౌస్ ప్రతినిధి ఆండ్రూ బేట్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.