మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి కొత్త మార్గదర్శకాలు.. విడుదల చేసిన ట్రాయ్
- ఇకపై 7 రోజుల్లోనే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ పూర్తి కాకుండా చెక్
- సిమ్ స్వాప్ మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త నిబంధనలు
- జులై 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మార్గదర్శకాలు
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియలో ‘యూనిక్ పోర్టింగ్ కోడ్’ కీలకమైన దశ అని, తాజా మార్గదర్శకాల ప్రకారం 7 రోజుల వ్యవధిలోనే టెలికం ఆపరేటర్లు యూపీసీ కోడ్‌ను జారీ చేయలేవని ట్రాయ్ వివరించింది. 8 అంకెలతో కూడిన యూపీసీ కోడ్ విషయంలో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టామని వివరించింది. కాగా ప్రస్తుతం వినియోగదారులు సర్వీస్ ప్రొవైడర్ పట్ల అసంతృప్తితో వేరే టెలికం ఆపరేటర్‌కు మారుతున్న విషయం తెలిసిందే. ఇందుకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ వినియోగదారులకు అవకాశం కల్పిస్తోంది. ఈ విధానం కొన్ని మోసపూరిత కార్యకలాపాలకు కూడా తావిస్తోంది. అందుకే వినియోగదారుల ప్రయోజనాల కోసం ట్రాయ్ తాజా మార్పులు తీసుకొచ్చింది.