Chandrababu: తాను చెప్పేది మోదీకి అర్థమవడం కోసం హిందీలో ప్రసంగించిన చంద్రబాబు... వీడియో ఇదిగో!

Chandrababu Hindi speech in PM Modi presence
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీని వేనోళ్ల కీర్తించారు. ఈ సందర్భంగా తాను చెప్పేది మోదీకి అర్థం కావడానికి చంద్రబాబు హిందీలో ప్రసంగించారు. 

"నేను ఈ రోజు ఒకటే చెబుతున్నాను. భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా చేసే శక్తి, సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉన్నాయి. ప్రపంచంలోనే భారతీయులను ఒక శక్తిమంతమైన జాతిగా తయారు చేయడం కోసం మోదీ, అమిత్ షా కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మేం మీ వెంట ఉంటాం. ఈ మేరకు ఈ సభాముఖంగా మేం మాట ఇస్తున్నాం" అని చంద్రబాబు పేర్కొన్నారు. 

చంద్రబాబు గతంలో జైపూర్ లో జరిగిన ఓ రాజకీయ సభలోనూ హిందీలో ప్రసంగించారు.
Go Back to Shorts
Chandrababu
Hindi Speech
Narendra Modi
Praja Galam
Boppudi
TDP-JanaSena-BJP Alliance

More Telugu News