మొక్కులు తీర్చుకునేందుకు కోటప్పకొండకు భక్తులు.. బోల్తాపడిన బస్సు
- పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకొనేందుకు స్కూలు బస్సులో ప్రయాణం
- బస్సు కట్టర్ విరిగిపోవడంతో బోల్తా పడిన బస్సు
- 40 మందికి గాయాలు.. ఒంగోలు రిమ్స్‌కు తరలింపు
బస్సు జిల్లాలోని తిమ్మాయపాలెంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలోకి చేరుకున్న సమయంలో బస్సు కట్టర్ విరిగిపోవడంతో బోల్తాపడింది. ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స అనంతరం ‘108’ వాహనాల్లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.