కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ హోటల్లో సోదాలు.. భారీగా పట్టుబడ్డ నగదు
- కరీంనగర్ లోని ప్రతిమ మల్టిప్లెక్స్ పై పోలీసుల రెయిడ్
- సోదాల్లో బయటపడ్డ రూ.6.65 కోట్ల నగదు సీజ్
- లెక్కా పత్రంలేని డబ్బు ఎవరిదనేది సస్పెన్స్
హోటల్ కేంద్రంగా భారీగా డబ్బులు తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు పకడ్బందీగా దాడులు చేసినట్లు సమాచారం. ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకే ఈ సొమ్ము తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యవహారాలన్నీ ఈ హోటల్ కేంద్రంగానే జరుగుతున్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు. ఈ హోటల్ బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులదే కావడం గమనార్హం.