Devineni Uma: ఆ మాట నీకెలా సెట్ అవుతుంది జగన్?: దేవినేని ఉమా

Devineni Uma questions CM Jagan
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో విజన్ విశాఖ పేరుతో సదస్సు నిర్వహించడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు. ముంపు ప్రాంతాల్లో ఇచ్చిన సెంటు పట్టా గురించి చెప్పే నీకు విజన్ అనే మాట ఎలా సెట్ అవుతుందని జగన్? అని ప్రశ్నించారు.

విశాఖ సదస్సులో జగన్ రెడ్డి విచిత్ర విన్యాసాలు చేశారని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో... చిరుద్యోగులు, చిరువ్యాపారులకు సూటు బూటు వేసి కూర్చోబెట్టి పారిశ్రామికవేత్తల కలరింగ్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. గత పెట్టుబడులకు సొంత డబ్బాలు కొట్టుకోవడం, మాటలు చెప్పుకోవడం తప్ప చేసేది ఉండదని దెప్పిపొడిచారు. కూల్చడం తప్ప కట్టడం రాదని దేవినేని ఉమా విమర్శించారు.


Go Back to Shorts
Devineni Uma
CM Jagan
Vision Visakha
TDP
YSRCP

More Telugu News