తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్ ఇదే
- ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకోనున్న ప్రధాని
- 10.45 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- 11.20 గంటలకు పఠాన్‌చెరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని
అనంతరం జిల్లాలోని పఠాన్‌చెరులో 11.20 గంటలకు నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సభాస్థలికి వచ్చేవారు ఎలాంటి వస్తువులు తీసుకురావొద్దని అధికారులు సూచించారు. కాగా ప్రధాని మోదీ నిన్న (సోమవారం) ఆదిలాబాద్‌లో పర్యటించారు. అనంతరం తమిళనాడు వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.