Narendra Modi: నేడు రాజ్ భవన్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ

PM Modi to visit Raj Bhavan today
  • తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ బిజీ బిజీ
  • ఉదయం ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో పాల్గొన్న మోదీ
  • ఆ తర్వాత తమిళనాడు బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని
  • తమిళనాడు నుంచి బేగంపేటకు చేరుకోనున్న నరేంద్ర మోదీ
  • రేపు ఉదయం సంగారెడ్డిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ఆ తర్వాత పఠాన్‌చెరు సభలో పాల్గొననున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస చేయనున్నారు. ఈ రోజు, రేపు ప్రధాని మోదీ తెలంగాణలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఆదిలాబాద్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం తమిళనాడులో బహిరంగ సభకు హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

తమిళనాడు నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. ప్రధానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రాజ్ భవన్‌కు చేరుకుంటారు. ఈరోజు అక్కడ బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం సంగారెడ్డికి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి పఠాన్‌చెరు చేరుకొని విజయ సంకల్ప సభలో పాల్గొంటారు.
Narendra Modi
BJP

More Telugu News