తమిళనాడులో 5, కేరళలో 3 సీట్లు గెలుచుకోనున్న బీజేపీ... ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే
- తమిళనాడు, కేరళలో గతంలో ఒక్క సీటూ గెలుచుకోని బీజేపీ
- కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ 22 సీట్లలో బీజేపీ గెలిచే అవకాశం
- ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్టీలు సున్నాకే పరిమితం
- దక్షిణాదిన బీజేపీ 35 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం
బీజేపీ కేరళ, తమిళనాడులో గతంలో ఒక్క సీటూ గెలుచుకోలేదు. కానీ 2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో ఐదు, కేరళలో మూడు సీట్లు గెలుచుకునే అవకాశముందని ఈ సర్వే వెల్లడించింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో గతంలో 25 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు 22కు పరిమితమయ్యే అవకాశముందని విశ్లేషించింది. తెలంగాణలో కాంగ్రెస్ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2 సీట్లు గెలుచుకునే అవకాశముందని పేర్కొంది. దక్షిణాదిన బీజేపీ 35 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు?
కేరళలో మొత్తం సీట్లు: 20
యూడీఎఫ్: 11
ఎల్డీఎఫ్: 06
బీజేపీ: 03
తమిళనాడులో మొత్తం సీట్లు: 40
డీఎంకే: 20
కాంగ్రెస్: 06
బీజేపీ: 05
అన్నాడీఎంకే: 04
ఇతరులు: 05
కర్ణాటకలో మొత్తం సీట్లు: 28
బీజేపీ: 22
కాంగ్రెస్: 04
జేడీఎస్: 02