Ram Charan: అంబానీ ఇంట పెళ్లి వేడుకలో మెరిసిన రామ్ చరణ్... ఫొటోలు ఇవిగో!

Ram Charan shines in Anant Ambani pre wedding gala

  • జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు
  • సతీసమేతంగా హాజరైన రామ్ చరణ్
  • డిజైనర్ దుస్తుల్లో జిగేల్మన్న గ్లోబల్ స్టార్

భారత సంపన్నుడు ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. తన అర్ధాంగి ఉపాసనతో కలిసి జామ్ నగర్ వెళ్లిన రామ్ చరణ్... మూడ్రోజుల పాటు సాగిన ఈ ముందస్తు పెళ్లి వేడుకల్లో తన గుర్తింపును నిలుపుకున్నారు. 

తొలి రోజున సంప్రదాయబద్ధంగా డిజైనర్ హ్యాండ్ మేడ్ బంద్ గలా సల్వార్ సూట్లో మెరిసిపోయిన రామ్ చరణ్.. ఆ తర్వాత బ్లాక్ అండ్ బ్లాక్ ఉస్మాన్ సూట్లో జిగేల్మన్నాడు. కళ్లకు ఏవియేటర్ తరహా ప్లెయిన్ గ్లాసెస్, కాళ్లకు డిజైనర్ హాఫ్ షూతో తన ట్రేడ్ మార్క్ స్టయిల్ ను చాటుకున్నారు. ఉస్మాన్ బ్రాండ్ దక్షిణ భారతదేశపు ప్రముఖ డిజైనర్ దుస్తుల బ్రాండ్. 

ఇక, ఖాన్ త్రయంతో నాటు నాటు పాటకు స్టెప్పులేసిన సమయంలోనూ రామ్ చరణ్ అందరి దృష్టిని ఆకర్షించారు.

Ram Charan
Anant Ambani
Radhika Merchant
Pre Wedding
Upasana
Jam Nagar
Mukesh Ambani
Nita
  • Loading...

More Telugu News