ప్రభుత్వం కక్ష సాధింపు చర్య... కావాలనే నన్ను టార్గెట్ చేశారు: మాజీ మంత్రి మల్లారెడ్డి
- అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని ఆరోపణ
- హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొని అప్పుడు కాలేజీ కోసం రోడ్డు వేసినట్లు వెల్లడి
- 2,500 గజాల రోడ్డు స్థలానికి గాను ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చినట్లు వెల్లడి
హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొని తాను అప్పుడు కాలేజీ కోసం రోడ్డు వేశానన్నారు. 2,500 గజాల రోడ్డు స్థలానికి గాను ప్రత్యామ్నాయంగా తన స్థలాన్ని నాడు మున్సిపాలిటీకి ఇచ్చానని మల్లారెడ్డి తెలిపారు. కాలేజీ రోడ్డు తొలగించడంతో 25 వేలమంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఇకపై తమ కాలేజీ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.