హార్ధిక్ పాండ్యా వద్ద ఇషాన్ కిషన్ ట్రైనింగ్ తీసుకోవడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి!
- ఐపీఎల్ కోసం శిక్షణ తీసుకోవడంపై సెలక్టర్లు అసహనంగా ఉన్నారన్న ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో
- సెంట్రల్ కాంట్రాక్టులకు ఆటగాళ్ల పేర్లు సిఫార్సులు చేసిన సెలక్టర్ల ఆగ్రహానికి గురయ్యాడని వెల్లడి
- ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ పేర్లను తప్పించిన బీసీసీఐ
కాగా స్టార్ ప్లేయర్‌లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లకు వార్షిక కాంట్రాక్టుల జాబితాలో చోటుదక్కలేదు. వీరిద్దరి పేర్లను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వీరిద్దరికి వార్షికవేతనం లభించలేదు. ఆర్థిక నష్టమే కాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ వంటి బీసీసీఐ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి వీలుండదు. ఆటగాళ్ల సంబంధిత రాష్ట్ర క్రికెట్ బోర్డుల నుంచి అనుమతి పొందితే మాత్రమే సౌకర్యాలను పొందేందుకు వీలుంటుంది. అంతేకాదు బీమాను కూడా కోల్పోతారు. ఎవరైనా ఆటగాడు గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైతే ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసే అవకాశాన్ని అయ్యర్, కిషన్ ఇద్దరూ కోల్పోయారు.