అమెరికా తొలి ప్రైవేటు స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయింది ఇక్కడే.. ఫొటోలు విడుదల చేసిన నాసా
- గతవారం చంద్రుడిపై ల్యాండ్ అయిన ఒడిస్సియస్
- 1972 తర్వాత తొలిసారి చంద్రుడిపై దిగిన అమెరికా వ్యోమనౌక
- 90 కిలోమీటర్ల పైనుంచి ఫొటోలు తీసి పంపిన అమెరికా రికానైసెన్స్ అర్బిటర్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ఒడిస్సియస్ ల్యాండ్ అయిన ప్రదేశం ఫొటోలను షేర్ చేసింది. తమ లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ ఈ ఫొటోలు తీసిందని పేర్కొంది. ఈ నెల 24న 90 కిలోమీటర్ల పైనుంచి తమ నిఘా ఉపగ్రహం ఈ ఫొటోలు తీసిందని తెలిపింది. కాగా, 1972లో అపోలో 17 తర్వాత అమెరికాకు చెందిన మరో స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై ల్యాండ్ కావడం ఇదే తొలిసారి.