కాంగ్రెస్ పార్టీ తొలి హామీని ప్రకటించిన వైఎస్ షర్మిల
- ఇందిరమ్మ అభయం పేరుతో తొలి గ్యారెంటీని ప్రకటించిన షర్మిల
- ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇస్తామని హామీ
- పేద కుటుంబాలు నిర్భయంగా బతికేందుకు తీసుకొస్తున్న పథకమని వ్యాఖ్య
ఇతర రాష్ట్రాలు అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నాయని... చంద్రబాబు, జగన్ ల పదేళ్ల పాలనలో ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని షర్మిల విమర్శించారు. పదేళ్లలో పట్టుమని 10 ఉద్యోగాలు కూడా రాలేదని అన్నారు. ప్రత్యేక హోదా జగన్ తోనే సాధ్యమని ప్రజలు నమ్మితే... అధికారాన్ని అనుభవిస్తూ ఆయన ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని విమర్శించారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో దీక్షలు చేయలేదని, రాజీనామాలు చేయలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడూ ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు.