మరణం ఎవరికైనా బాధాకరమే! ఇంటర్నెట్‌లో కన్నీరు పెట్టిస్తున్న వీడియో ఇదిగో!
- చనిపోయిన ఆడ కోలాను పట్టుకుని రోదిస్తున్న మగ కోలా
- ఒళ్లో పెట్టుకుని, హత్తుకుని ఏడుపు
- వీడియోను షేర్ చేసిన కోలా రెస్క్యూ గ్రూప్
ఆ వీడియోలో ఓ కోలా చనిపోయిన కోలాను తన ఒళ్లో పెట్టుకుని రోదిస్తోంది. దానిని తనివితీరా హత్తుకుని తన ప్రేమను చాటుకుంది. ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్థానికులు కోలా రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారొచ్చి కోలాను తమ రక్షణలోకి తీసుకున్నారు. చనిపోయింది ఆడ కోలా అని గుర్తించారు. మగ కోలాకు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. ఆడ కోలా మరణానికి కారణం తెలియరాలేదు.