మలుపు తిరిగిన లిక్కర్ కేసు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా మార్చిన సీబీఐ.. విచారణకు రావాలని సమన్లు
- ఇప్పటి వరకు కేసులో సాక్షిగా ఉన్న కవిత
- ఇప్పుడు కవితను నిందితురాలిగా మార్చిన సీబీఐ
- 26న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ
గత డిసెంబర్ లో కవితను సీబీఐ విచారించింది. ఇప్పటి వరకు ఈడీ మూడు సార్లు విచారణ జరిపింది. అయితే సీబీఐ విచారణకు కవిత హాజరవుతారా? లేక కోర్టును ఆశ్రయిస్తారా? అనే విషయంలో ఆసక్తి నెలకొంది. గతంలో ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఉన్న కవిత... ఇప్పుడు నిందితురాలిగా మారడంతో కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్టయింది.