చీటికిమాటికి పారాసిటమాల్ అదేపనిగా వాడుతున్నారా.. ఈ విషయం తెలిస్తే జాగ్రత్త పడతారు!
- రోజుకు నాలుగు గ్రాముల డోసు మించి వాడితే ప్రమాదం
- కాలేయానికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తల హెచ్చరిక
- కాలేయం, ఇతర అవయవాల మధ్యనున్న కణజాలాన్ని దెబ్బతీస్తున్న ఔషధం
పారాసిటమాల్ డ్రగ్ అవయవాల్లోని కీలకమైన నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాలేయం, ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని పారాసిటమాల్ దెబ్బతీస్తున్నట్టు పరిశోధనలో వెల్లడైనట్టు పేర్కొన్నారు. పారాసిటమాల్ కారణంగా కాలేయం దెబ్బతింటుందని గుర్తించిన మొదటి అధ్యయనం ఇదే. ఎడిన్‌బరో యూనివర్సిటీతోపాటు ఓస్లో, స్కాటిష్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సర్వీస్ పాల్గొన్న ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.