Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

Fire accident in Vizag steel plant
  • తార్ ప్లాంట్ లో నిప్పురవ్వలు పడటంతో చెలరేగిన మంటలు
  • మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
  • ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న వైనం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తార్ ప్లాంట్ లో నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగాయి. ప్లాంట్ లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటలకు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

  • Loading...

More Telugu News