Kesineni Chinni: టీడీపీ టికెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి నుంచి డబ్బులు తీసుకున్నారు: కేశినేని చిన్ని

Kesineni Chinni alleges Kesineni Nani collected money from two persons pretext of TDP tickets
  • విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య రాజకీయ పోరు
  • మరో రెండు నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరమవుతారన్న చిన్ని
  • అక్రమాలు బయటపడుతున్నాయనే నాని పార్టీ మారారని ఆరోపణ
విజయవాడ రాజకీయాల్లో అన్నదమ్ముల సవాల్ నెలకొంది. ఇప్పటిదాకా టీడీపీలో కొనసాగిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైసీపీ పంచన చేరగా... తమ్ముడు కేశినేని చిన్నిని టీడీపీ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నపై కేశినేని చిన్ని (కేశినేని శివనాథ్) ధ్వజమెత్తారు. 

మరో రెండు నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావడం తథ్యం అని స్పష్టం చేశారు. టీడీపీ టికెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి నుంచి డబ్బు వసూలు చేశారని, ఆ ఇద్దరు ఎవరో త్వరలోనే బయటపెడతామని చిన్ని వెల్లడించారు. అక్రమాలు బట్టబయలు అవుతున్నాయన్న భయంతోనే కేశినేని నాని పార్టీ మారారని ఆరోపించారు. 

చంద్రబాబును తిట్టే వాళ్లను ప్రోత్సహించి, చివరికి టికెట్ ఎగ్గొట్టడం జగన్ నైజం అని, ఇంతవరకు విజయవాడ ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిని ప్రకటించలేదని చిన్ని వివరించారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరవుతారో వేచి చూడాలని అన్నారు.
Kesineni Chinni
Kesineni Nani
Vijayawada
TDP
YSRCP

More Telugu News