Allu Arjun: 'పుష్ప 3'పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

Allu Arjun gives clarity on Pushpa 3
  • ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'పుష్ప 2'
  • 'పుష్ప 3' కచ్చితంగా ఉండొచ్చన్న బన్నీ
  • ఈ చిత్రంపై తమకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని వెల్లడి

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినమా సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాదిని కూడా ఈ సినిమా ఊపేసింది. ఈ చిత్రంతో బన్నీ ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది. ఈ సినిమా ద్వారా ఆయన గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. అంతేకాదు, ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డును సాధించాడు. తెలుగులో ఈ ఘనతను సాధించిన తొలి నటుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. 

ఆగస్ట్ లో 'పుష్ప 2' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత అద్భుతంగా ఉంటుందని సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు 'పుష్ప 3' కూడా రాబోతోందనే టాక్ నడుస్తోంది. దీనిపై బన్నీ క్లారిటీ ఇచ్చాడు. 'పుష్ప 3' కచ్చితంగా ఉండొచ్చని తెలిపాడు. ఆ చిత్రానికి సంబంధించి తమకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్పాడు. బెర్లిన్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కోసం జర్మనీకి బన్నీ వెళ్లాడు. 'పుష్ప 3'పై అక్కడే ఆయన క్లారిటీ ఇచ్చాడు.

  • Loading...

More Telugu News